twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్‌: పవన్‌కల్యాణ్‌ ఆ పార్టీలో చేరి,ఎన్నికలలో...

    By Srikanya
    |

    హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ తన రాజకీయ ఆలోచనల గురించి ఈ నెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తారని ఓ ప్రకటనలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో రాజకీయాలపై తనకున్న అభిప్రాయాలనీ, పార్టీ, ఎన్నికల్లో పోటీ గురించి చెప్పబోతున్నారని ఆ ప్రకటనలో తెలియచేసారు. ఈ నేపధ్యంలో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు లేదా స్వంతంగా పార్టీ పెడతారా అనే విషయాలపై ఓ రేంజిలో చర్చ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ, మీడియాలోనూ జరుగుతోంది. తాజాగా ఈ విషయమై ఓ వార్త ఎక్కువ ప్రచారం పొందుతోంది. అదేమిటంటే...

    పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారు అదీ...ఆమ్ ఆద్మీ పార్టీ తో కలిసి అని. ఆయన మల్కాజ్ గిరి(సికింద్రాబాద్) నియోజకవర్గం నుంచి ఎంపీ గా పోటీ చేయబోతున్నారు. తెలంగాణాని ఆయన తన స్వంత ప్రాంతంగా భావించి ఇలా పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క లోక్ సత్తాలో ఆయన చేరే అవకాసమున్నట్లు పవన్ ..లోక్ సత్తా పార్టీ కండువా భుజాన వేసుకున్నట్లు ఫేస్ బుక్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ సమాచారమూ బయిటకు రాలేదు.

    Pawan joining the Aam Aadmi Party

    కొంతకాలంగా అన్నయ్య చిరంజీవితో పవన్‌కల్యాణ్‌ విభేదిస్తున్నారని కూడా సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. మహా శివరాత్రి రోజున నాగబాబు కుమారుడు నటించే సినిమా ప్రారంభోత్సవంలోనూ చిరు, పవన్‌లు మాట్లాడుకోలేదనే విషయం చర్చనీయాంశమైంది. వీటికి తెరదించే ప్రయత్నం ఈ ప్రకటన ద్వారా చేశారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ తాను నటించే చిత్రాలకు సంబంధించిన కథాచర్చల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

    పవన్‌కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా..! రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా..! లేదా ఇప్పటికే ఉన్న పార్టీలో చేరబోతున్నారా!! ...ఇలాంటి ప్రచారం ఆదివారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో విస్తృతంగా సాగింది. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పేరు, లోగో వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని, ఆయన ఎంపీగా పోటీచేస్తారని సామాజిక మాధ్యమం హోరెత్తింది.

    పవన్‌కల్యాణ్‌ ఓ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని, లేదంటే ఆయనే స్వయంగా ఓ పార్టీని స్థాపించే ఆలోచన చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వూహాగానాల నేపథ్యంలో.. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాల్ని వెల్లడించేందుకు పవన్‌కల్యాణ్‌ సన్నద్ధమవుతున్నారు. పవన్‌కల్యాణ్‌ తన రాజకీయ ఆలోచనల గురించి ఈ నెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు.

    English summary
    According to reports, Pawan is all set to join politics and Pawan is most likely joining the Aam Aadmi Party. According to close associates of Pawan he will be contesting as an independent and he is going to
 contest for Member of Parliament (MP) from Malkajgiri (Secunderabad).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X