పవన్ తాజా చిత్రం రెమ్యునేషన్ అంతా?
హైదరాబాద్: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి పవన్ 14 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాకి ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ రేటు సమంజసమే అంటున్నారు. అయితే పవన్ కి ఇంత రెమ్యునేషన్ ఇస్తే,ఇక త్రివిక్రమ్ కి ఎంత ఇస్తారు,హీరోయిన్ కి ఎంత ఇవ్వాలి,మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అనే అంచనాలు మొదలయ్యాయి. ఈ మేరకు బిజినెస్ ఎంత కావాలి అనేది ఇప్పుడు ట్రేడ్ లో నలుగుతున్న ప్రశ్న. సినిమా గబ్బర్ సింగ్ రేంజి అయితే ఈ రెమ్యునేషన్స్ ,బడ్జెట్లు ఎవరినీ బాధించవు అనేది నిజం.
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.
ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు.చేతిలో ఫుల్లుగా సినిమాలు ఉన్న కథానాయిక సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు ఎంపికయినట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ సినిమా కారణంగానే రామ్ చరణ్ 'ఎవడు'లో ఆమె అవకాశం కోల్పోయిందనే ప్రచారం కూడా జరిగింది.


Click it and Unblock the Notifications











