పవన్ కళ్యాణ్ దాన్నే ఫైనల్ చేశారా? తాజా పరిస్థితి చూస్తుంటే..
గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వెండితెరపై ఓ వెలుగు వెలుగుతూ 25 సినిమాలు పూర్తి చేసిన ఆయన.. 'అజ్ఞాతవాసి' తర్వాత రెండేళ్ల పాటు జనసేన పార్టీ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ఇప్పుడు ఖాళీ సమయం దొరకడంతో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.
ఈ మేరకు తన 26వ సినిమాగా పింక్ రీమేక్ 'వకీల్ సాబ్'లో నటిస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో చురుకుగా ఉండేలా పవర్‌ఫుల్ స్కెచ్ వేసుకున్న పవన్.. 'వకీల్ సాబ్' చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేశారు. పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జానపద నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు ఫినిష్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు.

ఈ మూవీలో కోహినూర్ వజ్రం దొంగలించే దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ క్రిష్ 'విరూపాక్ష' టైటిల్‌ను ఫిలించాంబర్లో రిజిస్టర్ చేయించడంతో.. పవన్ కళ్యాణ్ దాన్నే ఫైనల్ చేశారని, అదే పవన్ 27వ సినిమా టైటిల్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











