దిల్ రాజు బ్యానర్ లో పవన్ కళ్యాణ్
చాలాకాలంగా తన బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ని నటింపచేయాలని దిల్ రాజు ట్రై చేస్తున్నారు. కానీ మెటిరియలైజ్ కాలేదు. కానీ తాజాగా దిల్ రాజు పట్టుదలతో పవన్ కళ్యాణ్ ని ఒప్పించినట్లు సమాచారం. దిల్ రాజు తన దగ్గరున్న అశోసియేట్ లలో ఒకరి చేత చెప్పించిన స్టోరీ లైన్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఎవరా దర్శకుడు అన్నది మాత్రం పేరు బయిటకు రాలేదు. ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. 2012 ఆగస్టులో ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో పవన్ కళ్యాణ్ ని నటింపచేయాలని ప్రయత్నించి దిల్ రాజు విఫలమయ్యారు. చివరకు మహేష్ చేత ఓకే చేయించుకుని ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన చాలా చిత్రాలను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకు మొదటి నుంచి ఆయన హీరోగా సినిమా నిర్మించాలని కోరిక.
అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ డేట్స్ పట్టుకోగలగి సినిమాలు చేస్తున్నారు కానీ ఆ కోరిక మాత్రం కలగానే మిగిలిపోతోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పంజా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రంపై ఆయన చాలా నేమ్మకాలు పెట్టుకున్నారు. తమిళ దర్శకుడు విష్ణువర్దన్ దర్సకత్వంలో రూపొందన ఈ చిత్రం పవన్ అభిమానులుకు ట్రీట్ లా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం దబాంగ్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దుతున్నారు.


Click it and Unblock the Notifications











