twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనాధలను దత్తత తీసుకుంటున్న పవన్ సేవానిరతికి హ్యాట్సాఫ్...!

    By Sindhu
    |

    గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మతిస్తిమితం లేని 100మంది పిల్లలను దత్తత తీసుకొని వారి కావలసిన సౌకర్యాలు సమకూర్చుతున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సియంపిఎఫ్)ను 2008లో ప్రారంభించవలసి ఉన్నింది, అయితే తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా అఫిషియల్ గా చేయ్యెచ్చు అనే భావంతో సియంపిఎఫ్ ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ప్రజారాజ్యంపార్టీ, కాంగ్రెస్ లో వీలినం అయిపోయింది కాబట్టి, పవన్ కళ్యాణే స్వతహాగా ఒక్కరే ఈ కార్యక్రామానికి కార్యరూపందాల్చనున్నారు.

    అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సేవా గుణం మెండు అని చాలా విషయాలు ప్రూవ్ చేసాయి. తాజాగా మరో వార్త పవన్ సేవా గుణాన్ని బయట పెడుతోంది. ఇటీవల తన భార్య రేణుదేశాయ్ తన పిల్లలను తీసుకుని పవన్ ని వదిలేసి వెళ్ళిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంగా చాలా కాలంగా పవన్ కళ్యాణ్ చాలా టెన్షన్ లో ఉన్నాడని వినికిడి.

    కానీ ఎన్ని టెన్షన్ లు ఉన్నా తనలో దాగి ఉన్న సేవాగుణంతో ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకు గట్టి పునాది అవ్వాలని కోరుకుంటున్నాడట. కొంతమంది హీరోల్లా కేవలం మాటల వరకే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈ పని చేస్తాడని, అంతటి సేవాగుణం అతనికి ఉందని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ మంచి పనిని ఖచ్చితంగా అందరూ అభినందించి తీరాల్సిందే...

    English summary
    Powerstar Pawan Kalyan is planning to adopt two orphan kids and raise them. He has been fond of his kids but his wife Renu Desai left him and also took his kids along with her. So, pawan planned to adopt two orphans and also he had this thought since long time to do some ‘real’ service to society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X