పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించబోతున్న కమెడియన్ ఆలీ.. అలా సెట్ చేసిన స్టార్ దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకప్పుడు కమెడియన్ ఆలీ ఎదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు. అతనికి సరైన పాత్ర లేకపోయినప్పటికీ పవన్ ఎదో ఒక రకంగా ఆలీని సినిమాలో చూపించేవాడు. అంతలా వారి మధ్య బాండింగ్ ఉండేది. ఇక రాజకీయాల వల్ల విబేధాలు రావడంతో దూరమైన ఈ ఇద్దరు మళ్ళీ కలిసి మళ్ళీ నటించరేమో అని అనుకున్న తరుణంలో సడన్ గా ఒక దర్శకుడు ఈ కాంబోని మళ్ళీ వెండితెరపై సెట్ చేసినట్లు సమాచారం.

యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

మెగా బ్రదర్ అనే భేదం లేకుండా

మెగా బ్రదర్ అనే భేదం లేకుండా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ఆలీ స్నేహం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు పవన్ కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి సినిమాలో ఆలీ స్క్రీన్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. మెగా బ్రదర్ అనే భేదం లేకుండా ఆలీతో పవన్ స్నేహాన్ని కొనసాగించారు.

అలీకి పాత్రలు లేకపోతే

అలీకి పాత్రలు లేకపోతే

పవన్ సినిమా అంటే అందులో తప్పకుండా ఆలీ ఉండాల్సిందే. అంతలా వీరి మధ్య స్నేహం అనేది ఉండేది. బాలు సినిమాలో ఎలాంటి పాత్ర చేయడానికి వీలు లేకపోతే చివరికి పవన్ ఒక పాటలో అతన్ని యాక్ట్ చేయించాడు. దర్శకులు కూడా పవన్ కు కథ చెప్పాలని అనుకుంటే ముందుగానే ఆలీ కోసం కూడా ఒక రోల్ క్రియేట్ చేసుకునేవారు.

మాటల యుద్ధాలు జరగడంతో..

మాటల యుద్ధాలు జరగడంతో..

ఇక ఆ మధ్య రాజకీయాల కారణంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆలీ వైఎస్సార్ సీపీ చేరడంతో అందరూ షాక్ అయ్యారు. అనంతరం పవన్, ఆలీ మధ్య మాటల యుద్ధాలు జరగడం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక మళ్ళీ వాళ్ళు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేరేమో అనేంతలా అనుమానాలు వచ్చాయి.

పవన్ చేయబోయే తదుపరి సినిమాల్లో

పవన్ చేయబోయే తదుపరి సినిమాల్లో

కానీ అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడానికి తాను రెడీ అని ఆలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తమ మధ్య మళ్ళీ ఎప్పటిలానే మంచి స్నేహమే ఉందని అన్నాడు. కోవిడ్ రావడం వలన దూరంగా ఉన్నాము అంతే అంటూ పవన్ చేయబోయే తదుపరి సినిమాల్లో తప్పకుండా ఎదో ఒక సినిమాలో ఉండవచ్చని అన్నాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో

హరీష్ శంకర్ దర్శకత్వంలో

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే ఆలీ నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ గాసిప్ పై ఇప్పటివరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక పవన్ కూడా ఆలీతో నటించడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా విమర్శలు చేసినప్పటికీ ఆయనతో వకీల్ సాబ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆలీతో కూడా నటించడానికి పవన్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X