Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు కోసం 20 టీమ్‌లు.. పవన్ మూవీకి రోజుకు 20 గంటలపాటు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పండగలాంటి వార్త. గత కొద్దికాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను యుద్ద ప్రాతిపాదికన ముగించేందుకు పవర్ స్టార్ సిద్దమైనట్టు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ప్లాన్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు సినిమా కోసం హైదరాబాద్‌లో సెట్ వేశారు. ఏప్రిల్ 14వ తేదీ లోపు తనకు సంబంధించిన పోర్షన్‌ను పూర్తి చేసేందుకు పవన్ కల్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఆయన కేటాయించిన డేట్స్‌లో సినిమాలోని కీలక సన్నివేశాలను పూర్తి చేస్తారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రమోషనల్ కార్యక్రమాల జోష్ పెంచుతారు అని వెల్లడించారు.

Hari Hara Veera Mallu

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్పస్ వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని మూడో పాటలను ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తారు. అలాగే 4వ పాటను ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు పాటల్లో ఒకటి మాస్ డ్యాన్స్ కూడిన సాంగ్, మరో మెలోడీగా సాగే సాంగ్ అని తెలిసింది.

ఇక ఎంఎం కీరవాణి ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 19, 20 తేదీలలో ఈ చిత్రానికి బీజీఎం పూర్తి చేస్తారు. ఏప్రిల్ 20వ తేదీన ఈ మూవీకి సెన్సార్ పూర్తి చేయనున్నట్టు తెలిసింది. ఇలా ముందస్తు ప్లాన్‌తో వార్ బేసిస్‌గా హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు సమాచారం.

హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా 20 వీఎఫ్ఎక్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. సకాలంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రోజుకు 20 గంటలపాటు టీమ్ పనిచేస్తున్నది. మరో 15 రోజుల్లో ఈ సినిమా కంటెంట్‌ను వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X