పవన్ కళ్యాణ్, మెగా హీరో బాక్సాఫీస్ ఫైట్.. ఆ పండగ సమయంలో క్లాష్ అయ్యే ఛాన్స్?
స్టార్ హీరోలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడక తప్పదు. ముఖ్యంగా పండగ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన హీరోలు కూడా చాలాసార్లు ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక రాబోయే కాలంలో కొంతమంది మెగా హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరోలు అయితే చాలావరకు పోటీ లేకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న తరుణంలో మరో మెగా హీరో సినిమా కూడా ఒక పండుగను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2024 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. వీరి కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది.

అయితే సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ తేజ్ శంకర్ కలయికలో రాబోతున్న RC 15 ప్రాజెక్ట్ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఎప్పటినుంచో విడుదల చేయాలని అనుకుంటున్నాప్పటికీ శంకర్ ఆలస్యం చేస్తూ ఉండడంతో సినిమా వాయిదా పడుతోంది. ఇక అదే సమయంలో ప్రభాస్ ప్రాజెక్ట్ K కూడా రాబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.
కానీ ఆ సినిమా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కు రావచ్చని టాక్ వస్తోంది. ఇక నాగార్జున ప్రసన్నకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఒక రీమేక్ సినిమా కూడా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ ఉస్తాద్ సినిమా అయితే రావచ్చు అని తెలుస్తోంది. మరి సంక్రాంతి ఫెస్టివల్ లో పవన్ కళ్యాణ్ కు పోటీగా అబ్బాయి రామ్ చరణ్ సినిమాను విడుదల చేస్తారో లేదో తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











