నితిన్ పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకపోతే ఎలా?.. స్టార్ దర్శకుడితో పాటు కుర్ర హిర్రోలు కూడా..
మొత్తానికి నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రేయసి షాలినిని ఈ నెల 26న హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఈ పెళ్లికి అతిధులుగా ఎవరెవరు రాబోతున్నారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీలైనంత వరకు తక్కువ మంది గెస్ట్ ల సమక్షంలోనే నితిన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసి..
గత ఏడాది నుంచి నితిన్ పెళ్లి గురించి అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని రెండు నెలల ముందు నుంచే భారీగా ఖర్చు చేసి ప్లాన్ చేసుకున్న నితిన్ కరోనా వైరస్ కారణంగా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఏప్రిల్ లో ప్లాన్ చేసుకున్నప్పటికి అప్పుడు కూడా వర్కౌట్ కాలేదు.

ఆహ్వాన పత్రికలు అందినట్లే..
ఫైనల్ గా షాలినితో ఈ నెల 26న పెళ్లి ఫిక్స్ చేసుకున్న నితిన్ ఇప్పటికే అతిధులకు ఇవ్వాల్సిన ఆహ్వాన పత్రికలను చాలా వరకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. నిన్న ప్రగతి భవన్ కి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రత్యేకంగా కలుసుకొని పెళ్లి పత్రిక ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ కూడా నితిన్ కి విషెస్ అందించి వస్తానని సానుకూలంగా స్పందించారు.

అభిమాన హీరో వస్తాడా...
ఇక నితిన్ పెళ్లికి ఎవరు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ రాకపోతే మాత్రం అభిమానులు తట్టుకోలేరు. ఎందుకంటే నితిన్ అభిమానులు పవన్ అభిమానులు దాదాపు సమానమనే చెప్పాలి. పవన్ ని నితిన్ స్థాయిలో ఆరాదిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ కి ఇన్విటేషన్ అందిందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళు కూడా..
ఇక మొత్తానికి నితిన్ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా రాబోతున్నారు. ఇక మరికొంత మంది కుర్ర హీరోలు కూడా వేడుకలో రానున్నట్లు తెలుస్తోంది. అందులో అఖిల్, సాయి ధరమ్ తేజ్, తరుణ్, రానా, వంటి యువ హీరోలే కాకుండా ప్రముఖ కామెడియన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











