పవన్ కళ్యాణ్, ప్రభాస్ డబుల్ ధమాకా.. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత పక్కా!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఊహించని ప్రాజెక్టులు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అగ్ర హీరోలు కూడా విభిన్నమైన దర్శకులతో డిఫరెంట్ స్టైల్లో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా డబుల్ ధమాకా ప్రాజెక్ట్ లతో అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరు చేస్తున్న ప్రాజెక్టులలో రెండు.. రెండు భాగాలుగా రాబోతున్నాయట. ఆ వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు ట్విస్ట్ తో..

హరిహర వీరమల్లు ట్విస్ట్ తో..

ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తీసుకురాబోతున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కథలో మరొక ట్విస్ట్ తో దర్శకుడు మరొక భాగాన్ని నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ మరో సినిమా కూడా..

పవన్ కళ్యాణ్ మరో సినిమా కూడా..

అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. OG వర్కింగ్ టైటిల్ తో రానున్న ఆ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతోంది. ఇక దర్శకుడు సుజిత్ కూడా ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు అని కథనాలు వెలువడుతున్నాయి. అయితే మరి కొందరు మాత్రం ఇందులో నిజం లేదని కూడా చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

రెండు భాగాలుగా సలార్

రెండు భాగాలుగా సలార్

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ప్రాజెక్టులు కూడా రెండు భాగాలుగా రాబోతున్నాయి అని చాలా కాలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సలార్ అయితే రెండు పార్ట్స్ గా రాబోతుంది అని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఈ ఏడాది లో మొదటి భాగాన్ని అందించి మరో రెండేళ్ల తర్వాత రెండవ భాగాన్ని విడుదల చేసే అవకాశం ఉంటుందని సమాచారం.

ప్రాజెక్ట్ K.. ఇది నిజమేనా?

ప్రాజెక్ట్ K.. ఇది నిజమేనా?

ఇక ప్రాజెక్టు K కు సంబంధించిన కొన్ని రూమర్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా హాలీవుడ్ లో కూడా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు అని గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కూడా నిజం లేదు అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

ఫ్యాన్స్ ఫోకస్ వాటిపైనే..

ఫ్యాన్స్ ఫోకస్ వాటిపైనే..

మొత్తానికి ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరి సినిమాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏ సినిమాతో అయినా వీరి స్టార్ హోదాను పట్టి మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే అందరి ఫోకస్ కూడా సలార్ పైన ఎక్కువగా ఉంది. ఇక ప్రాజెక్టు కే కోసం కూడా ఓవర్గం ప్రేక్షకులలో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X