పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ కాంబినేషన్ ఫిక్స్? దర్శకుడు ఎవరో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్', 'గేమ్ ఛేంజర్' వంటి చిత్రాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమిది కావడం విశేషం. ఇక చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ ఫలితాలు కాస్తా నిరాశపరచడంతో నెక్ట్స్ రాబోయే చిత్రం పెద్దితో దుమ్ములేపబోతున్నారని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో 'పెద్ది' చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఆర్సీ17పై ఎవ్వరి ఊహాకు అందని టాక్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్ పెద్ది చిత్రం..
ఉప్పెన చిత్రం తర్వాత దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న చిత్రమే పెద్ది. ఇది ఈయనకు రెండోవ సినిమా. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరోవైపు రామ్ చరణ్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో బుచ్చిబాబు రామ్ చరణ్ ఫెవరేట్ డైరెక్టర్ కాబోతున్నారని హామీనిచ్చారు.

ఆర్సీ17 చిత్రంపై అదిరిపోయే బజ్..
రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నెక్ట్స్ క్రేజీ లైనప్ ను సెట్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఆర్సీ17 చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది. రామ్ చరణ్ ఆర్సీ17 ఏ దర్శకుడితో చేస్తారనేది మొన్నటి వరకు సస్పెన్స్ గా మారింది. ఓవైపు పుష్ప దర్శకుడు అంటూ.. మరోవైపు త్రివిక్రమ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ తో ఆర్సీ17 ప్రాజెక్ట్ లాక్ అయినట్టు గట్టిగా బజ్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ కాంబో..
రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఓకే అయితే వీరిది ఫ్రెష్ కాంబినేషన్ కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ లోకి పవన్ కళ్యాణ్ కూడా రానున్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఆర్సీ17 ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని అంటున్నారు. ఇలా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాంబో సెట్ కానుందని అంటున్నారు. దీనిపైనా కూడా ఎలాంటి మున్ముందు ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.
రామ్ చరణ్ ఇలా.. పవన్ కళ్యాణ్ అలా..
రామ్ చరణ్ పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ 26గా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











