మల్టీస్టారర్ విషయంలో పవన్ యూటర్న్: ఫ్యాన్స్‌కు మాత్రం మరో గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అతడు ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం సినిమాలకు గ్యాపిచ్చిన పవన్.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా రిజల్ట్‌తో ఫుల్ ఖుషీ అయిన అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

ఈ ఏడాది ఆరంభంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను అందుకుంది. అయితే, అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా ఈ చిత్రానికి కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయినప్పటికీ ఈ రిజల్ట్ పట్ల అటు పవన్.. ఇటు అభిమానులు ఫుల్ సంతృప్తిగానే ఉన్నారు. దీని తర్వాత పవన్ కల్యాణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే 'హరిహర వీరమల్లు' సినిమా షూట్‌లో కూడా పాల్గొన్నాడు. అలాగే, జనసేన పార్టీ కార్యక్రమాలలో కూడా చురుకుగానే పాల్గొంటున్నాడు.

Pawan Kalyan and Sai Dharam Tej Movie Starts Delay

ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోన్న టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాను ఈ స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను కూడా చేశారు. ఇప్పుడాయనే తెలుగులోకి ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వినోదయ సీతమ్' సినిమాను జూలై మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా చాలా ఆలస్యం కాబోతుందట. దీనికి కారణం ఇప్పుడు పవన్ 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలను ముందుగా పూర్తి చేయాలని భావిస్తుండడమే అని తెలుస్తోంది. ఇది ఒకరకంగా పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూసే అని చెప్పాలి. దీని తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాలపైనా ఫోకస్ చేయబోతున్నాడట. దీంతో 'వినోదయ సీతమ్' మరింత ఆలస్యం కానుందని తెలిసింది.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అందుకే ప్రస్తుతానికి ఆ సినిమాను ఆపేసి.. హరీశ్ శంకర్ తెరకెక్కించే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీని మొదలెట్టబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X