BRO: బ్రో మూవీ రన్ టైం అన్ని నిమిషాలే.. పవన్ కనిపించేది అంతసేపే.. అసలు మేటర్ తెలిస్తే షాకే!

టాలీవుడ్‌లో ఇప్పుడు తెరకెక్కుతోన్న చిత్రాల సంఖ్య భారీగా ఉంది. అయితే అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో (BRO)' మూవీ ఒకటి.

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో దీని గురించి ఎన్నో రకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'బ్రో' మూవీ రన్‌ టైం డీటెల్స్ లీక్ అయ్యాయి. దానికి సంబంధించిన వివరాలను చూసేయండి మరి!

Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Run Time Details Leaked

మెగా మల్టీస్టారర్‌గా వస్తుంది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రమే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రాబోతుంది.

Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Run Time Details Leaked

రిలీజ్‌కు చేరువ.. ఫుల్ స్పీడ్: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీని జూలై 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్లను వరుసగా ఇస్తున్నారు.

Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Run Time Details Leaked

ప్రమోషన్స్.. భారీ రెస్పాన్స్: చనిపోయిన వ్యక్తికి మరో ఛాన్స్ ఇవ్వడం అనే కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'బ్రో (BRO)' మూవీ రిలీజ్‌కు డేట్ దగ్గర పడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఎన్నో పోస్టర్లను, పాటను, టీజర్‌ను రిలీజ్ చేసింది. వీటన్నింటికి ప్రేక్షకులు, మెగా అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన కూడా లభించింది.

బ్రో మూవీ రన్ టైం డీటేల్స్: పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో (BRO)' మూవీ రిలీజ్‌కు సమయం ఆసన్నం అవడంతో దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా రన్ టైం లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. 'బ్రో (BRO)' మూవీ కేవలం 130 నిమిషాల నిడివితోనే వస్తుందట. అంటే ఇది రెండు గంటల పది నిమిషాలే ఉంటుంది.

Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Run Time Details Leaked

పవన్ ఎంట్రీ.. ప్రజెన్స్ ఇలా: మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీలో పవన్ కల్యాణ్ రోల్ గురించి కూడా సమాచారం లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాతనే పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడట. అంతేకాదు, మొత్తం 130 నిమిషాల మూవీలో అతడి పాత్ర 95 నిమిషాల లోపే కనిపిస్తుందని తెలిసింది. అంటే పవన్ కంటే ఎక్కువ సాయి ధరమ్ తేజ్ రోల్ కనిపిస్తుందట.

Pawan Kalyan and Sai Dharam Tej Starrer BRO Movie Run Time Details Leaked

ఇద్దరి సీన్స్ యమ హైలైట్: 'బ్రో (BRO)' మూవీలో పవన్ కల్యాణ్ దేవుడిగా.. సాయి ధరమ్ తేజ్ సామాన్య మానవుడిగా కనిపించబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో కొన్ని మ్యాజిక్‌లు కూడా కనిపిస్తాయట. వీళ్ల కాంబినేషన్ సీన్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయని, అవి ఫ్యాన్స్‌కు ఖుషీ నింపుతాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X