OG: పాత కథతోనే పవన్ సినిమా.. దానికి రీమేక్‌ అంటూ షాకింగ్ లీక్

యాక్టింగ్‌కు సుదీర్ఘ కాలం పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో కమ్‌బ్యాక్ అయిన ఈ స్టార్ హీరో.. ఇది పట్టాలపై ఉండగానే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'భీమ్లా నాయక్' అనే సినిమానూ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అలాగే, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఇది ఇంకా పూర్తి కాకముందే మరికొన్ని ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేశాడు.

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని లైన్‌లో పెట్టేశాడు. అలాగే, వినోదయ సీతమ్ రీమేక్, సురేందర్ రెడ్డితో ఓ సినిమాను కూడా చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పవర్ స్టార్.. 'సాహో' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ సుజిత్‌తో సినిమాను ప్రకటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అంతేకాదు, దీనికి OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు.

 Pawan Kalyan and Sujeeth Movie Comes as Remake Of Tamil Film

ఇక, కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అతి త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. పవన్ - సుజిత్ కాంబోలో రాబోతున్న ఇది.. ఓ తమిళ యాక్షన్ మూవీకి రీమేక్‌గా రాబోతుందట. దాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చి తెరకెక్కిస్తున్నారని తెలిసింది. అయితే, అది ఏ తమిళ సినిమా అన్నది మాత్రం తెలియలేదు. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించే సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇక, ఈ చిత్రంలో హీరోయిన్, పాటలు ఉండవని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X