పవన్ కళ్యాణ్ - సుజిత్.. ఆ డిజాస్టర్ సినిమా స్టైల్ లోనే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పీడ్ పెంచాడు. గత ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు రెగ్యులర్ పాలిటిక్స్ లో కూడా చాలా బిజీగా మారిపోయాడు. ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొంటున్నారు. సొంత డబ్బుతో కూడా పవర్ స్టార్ ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే సినిమాల షూటింగ్ విషయంలో మాత్రం మళ్లీ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యారు.
అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు మాట ప్రకారం సినిమాలు పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. భవదీయుడు భగత్ సింగ్ అనే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. అయితే మళ్లీ ఎందుకో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. మళ్ళీ దర్శకుడు మరో కథను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ముందుగానే పవన్ కళ్యాణ్ నిర్మాత డివివి దానయ్యతో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే.

ఇక అనుకున్నట్లుగానే దర్శకుడు సుజిత్ కూడా రెడీ అయ్యాడు. ఈసారి వారు రీమేక్ సినిమాతో రావడం లేదు. పవన్ కళ్యాణ్ స్టార్ హోదా స్టైల్ కు తగ్గట్టుగా సుజిత్ కథలు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అది కూడా పవన్ కళ్యాణ్ కెరిర్లో డిజాస్టర్ గా నిలిచిన సినిమా తరహా లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో కొన్ని సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ కు మాత్రం బాగానే నచ్చుతాయి. అందులో పంజా సినిమా కూడా ఉంటుంది.

తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తెరపైకి తీసుకువచ్చిన పంజా సినిమా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా పవన్ ఫ్యాన్స్ కు చాలా బాగా నచ్చుతుంది. అయితే దాదాపు అదే తరహాలో మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు సుజిత్ ఆ కథను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో ఒక డాన్ గా కనిపించబొతున్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











