OG: పవన్ ఓజీ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. మెగా ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు ఫిక్స్

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా తనదైన శైలిలో ఆడియెన్స్‌ను మెప్పించి స్టార్‌గా మారారు. ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను పెంచుకున్న పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు.

రీఎంట్రీలో పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు పలు ప్రాజెక్టులను చేస్తున్నారు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు.

Pawan Kalyan and Sujeeth OG Movie Release on 2025 March 27th

హై రేంజ్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే ముంబై నగరంలో మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి సగానికి పైగా షూట్ పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాదిలోనే విడుదల చేస్తున్నారట. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన రాబోతుందని టాక్.

Pawan Kalyan and Sujeeth OG Movie Release on 2025 March 27th

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను 2025 మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా దీనిపై ప్రకటన రాబోతుందట. ఇక, మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కూడా ఉంది. అంటే మెగా అభిమానులకు ఒకేరోజు రెండు పండుగలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X