OG: పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఓజీ మూవీ రిలీజ్ వాయిదా.. అంత ఆలస్యంగా ఎందుకంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈ మెగా హీరో దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు. ఒకవైపు రాజకీయలతో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను, సినీ ప్రియులను ఖుషీ చేస్తున్నాడు. ముఖ్యంగా రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు పవన్ ఏకంగా మూడు ప్రాజెక్టులను చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. సాహోతో దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ భారీగా ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని క్రేజీగా తెరకెక్కిస్తున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ముంబైలో ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లను విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఇందులో యాభై శాతం వరకూ టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలిసింది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. అందుకే ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటూ వస్తున్నారనే టాక్ వినిపించింది. అయితే, తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

పవర్‌ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ రిలీజ్‌ను వచ్చే ఏడాది అంటే 2024 ఏప్రిల్‌కు వాయిదా వేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం పవన్ కల్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే అని అంటున్నారు. రాజకీయాలతో బిజీగా ఉండడంతో పాటు దీని కంటే ముందు లైన్‌లో పెట్టిన సినిమాలను పూర్తి చేయాలని పవర్ స్టార్ డిసైడ్ అవడం వల్లే 'OG'ని వాయిదా వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











