OG: పవన్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు ఒకేసారి రెండు పండుగలు
అప్పటి కంటే ఇప్పుడు వేగంగా సినిమాలు చేస్తూ.. అభిమానులను, సినీ ప్రియులను ఓ రేంజ్‌లో అలరిస్తోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో వచ్చిన అతడు.. ఇప్పుడు ఏక కాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు.
ఇప్పుడు ఈ మెగా హీరో నటిస్తోన్న సినిమాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు.
అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అవన్నీ అద్భుతంగా వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది.
పవన్ కల్యాణ్ హీరోగా.. సుజిత్ తెరకెక్కిస్తోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారట.
అంతేకాదు, దీన్ని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకూ సెలవులు ఉండడం వల్లే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











