OG: పవన్ ఓజీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటి వరకూ ఆగక తప్పదు మరి!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' మూవీతో కమ్‌బ్యాక్ అయిన అతడు ఆ తర్వాత 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. కానీ, ఈ సినిమాలు కమర్షియల్‌గా పవన్‌ను నిరాశనే మిగిల్చాయిని చెప్పుకోవాలి.

ఎలాగైనా బిగ్ హిట్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాను చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan and Sujeeth OG Movie Release on Dussehra 2024

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి సగానికి పైగా షూట్ పూర్తి చేశారు.

'OG' మూవీకి సంబంధించి మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనుందని టాక్.

Pawan Kalyan and Sujeeth OG Movie Release on Dussehra 2024

పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అప్పటి వరకూ అతడు ఈ సినిమా షూట్‌లో పాల్గొనలేనని చెప్పేశాడట. దీంతో మే తర్వాతనే షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే ఈ చిత్రాన్ని దసరాకు తీసుకు రావాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X