పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. OG మూవీ అప్పటికి వాయిదా!
టాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన చిత్రాలతో సత్తా చాటి స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి తన రేంజ్‌ను మరింతగా పెంచుకునే సినిమాలే చేస్తున్నాడు. ముఖ్యంగా రీఎంట్రీలో పవన్ కల్యాణ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు.
రీఎంట్రీలో ఇప్పటికే పలు చిత్రాలతో అలరించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు.

పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఎప్పుడో మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటి వరకూ 50 శాతం కంటే ఎక్కువ టాకీ పార్టునే పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా ప్లాన్లు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఎన్నికల వల్ల బిజీ అవడంతో 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు చాలా బ్రేక్ వచ్చింది. దీంతో ఇది ఏమైనా ఆలస్యం అవుతుందా అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు వాయిదా పడుతుందట.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'OG' సినిమాను సెప్టెంబర్ 27 నుంచి వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి కారణం పవర్ స్టార్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న 'లక్కీ భాస్కర్' మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండడమే. అంటే.. అది వస్తుందంటే ఓజీ వాయిదా పడినట్లే అని సినీ విశ్లేషకులు కన్ఫార్మ్ చేస్తున్నారు. ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూసే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా, 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











