OG Postponed: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఝలక్.. ఓజీ అప్పటికి వాయిదా పడిందా!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్నో జోనర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. ఇక, రీఎంట్రీలో ప్రత్యేకతను చాటుకుంటోన్న పవర్ స్టార్.. ఇప్పుడు కూడా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తూనే ఉన్నాడు.
ఈ మధ్య కాలంలో మరింత హై రేంజ్ సినిమాలు చేస్తోన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు.

హై రేంజ్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఎప్పుడో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఏమాత్రం విరామం లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటి వరకూ సగం కంటే ఎక్కువ టాకీ పార్టునే పూర్తి చేసేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.
పవన్ కల్యాణ్ ఎన్నికల కారణంగా బిజీ అవడంతో 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు చాలా బ్రేక్ వచ్చింది. దీంతో ఇది ఏమైనా ఆలస్యం అవుతుందా అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. వాయిదా పడుతుందట.

పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'OG' సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయడం లేదని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీని అదే రోజున విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఇక, పవన్ కల్యాణ్ సినిమాను మాత్రం వచ్చే ఏడాది జనవరి నెలకు వాయిదా వేసినట్లు కూడా న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











