అభిమానుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం!
హైదరాబాద్: మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయంగా విడిపోయిన తర్వాత....మెగా అభిమాన సంఘాల్లోనూ చీలిక వచ్చింది. మెగా అభిమాన సంఘాల నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విడిపోయి వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి అభిమాన సంఘం నాయకులు, పవన్ అభిమాన సంఘం నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే రేంజికి పరిస్థితి దిగజారింది. ఫ్యాన్స్ మధ్య విబేధాలు ఇపుడు సర్వత్రా హాట్ టాపిక్ అయింది. అయితే ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాట్లాడక పోవడం చర్చనీయాంశం అయింది.
ఈ వ్యవహారంపై మెగా ఫ్యామిలీ మొత్తం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఫ్యాన్స్ వ్యవహారం మెగా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఫ్యాన్స్ తీరుపై పవణ్ కళ్యాణ్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పిలిపించి మందలించే యోచనలో ఉన్నట్లు పిల్మ్ నగర్ టాక్. తన కోసం ప్రత్యేకంగా అభిమాన సంఘాలు అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.

అసల ఏం జరిగింది?
తిరుపతిలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. అయితే చిరు సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామన్నారు. చిరు, పవన్, చెర్రీ, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు.
అయితే పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉండి, ఇటీవల జన సేన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారిని స్వామి నాయుడు కావాలని దూరం పెడుతుండటంతో పవన్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో స్వామి నాయుడు ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావద్దని పవన్ కళ్యాన్ అభిమాన సంఘం అధ్యక్షుడు కిరణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానుల సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రస్థాయి పవన్ అభిమాన సంఘాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కిరణ్ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











