'పంజా' విలన్ పై పవన్ సీరియస్!?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాలో విలన్ గా చేస్తున్న అడవి శేషుపై పవన్ చాలా సీరియస్ అయ్యారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దానకి కారణం పవన్ చిత్రంలో పనిచేయటంతో చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్న అడవి శేషు తన సర్కిల్స్ లో పంజాలో తన పాత్ర గురించి డిస్కస్ చేయటమే కారణమంటున్నారు. అంతేగాక కొంతమంది మీడియా మిత్రులతో కూడా ఈ విషయమై చెప్పింది అతని కొంపముంచుతోంది. దాంతో పవన్ అతనికి ఫోన్ చేసి అలా కథని, క్యారెక్టర్ ని సినిమా రిలీజ్ కు ముందే రివిల్ చేస్తే సినిమాపై ఆసక్తి ఉండదని మందలించినట్లు చెప్పుకుంటున్నారు. ఇక అడవి శేషుకి ఇది తెలుగులో రెండవ చిత్రం. మొదటి చిత్రం కర్మ. అతనే డైరక్ట్ చేసుకుని, హీరోగా చేసిన ఆ చిత్రం ఎక్కడా ఆడలేదు. అయితే అందులో అతని ఫెరఫార్మెన్స్ నచ్చిన పంజా నిర్మాతలు అతనికి ఈ ఆఫర్ ఇవ్వటం జరిగింది.
పంజాలో అడవి శేషు పాత్ర చాలా స్టైలిష్ గా సాగే నెగిటివ్ రోల్ అని చెప్పుకుంటున్నారు. ఇక నాలుగు రోజుల క్రితం పంజా ఆడియో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. పవన్ అభిమానులంతా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్స్, ఫస్ట్ లుక్ అంతటా ఓ రేంజిలో ఇంట్రస్టుని క్రియేట్ చేసింది. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా పంజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సారాజేన్ డైస్, అంజని లావని హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించిన విష్ణువర్థన్ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే చాలా భాగం షూటింగ్ చేసారు. ఈ చిత్రంలో పవన్ పాత్ర చిత్రణ, వేషధారణ కొత్త పంథాలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: యువన్ శంకర్‌రాజా.


Click it and Unblock the Notifications











