పాన్ ఇండియా దర్శకుడితో పవన్ కళ్యాణ్ న్యూ మూవీ.. కథ రాసింది ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారి సక్సెస్ అయిన వారు మరోసారి కలిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ కోసం ఒక స్టార్ దర్శకుడు అలాగే మరో స్టార్ రైటర్ కూడా కలిసి పనిచేయబోతున్నారు. వారు గతంలో మంచి బాక్సాఫీస్ హిట్స్ కూడా అందుకున్నారు.
Recommended Video

కరోనా ఎఫెక్ట్..
పవన్ కళ్యాన్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో కూడా బిజీగా మారారు. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యుండేది. కానీ అనుకోని విధంగా వాయిదా పడటటంతో మిగతా సినిమాలు కూడా చాలా ఆలస్యంగా మొదలు కానున్నాయి.

ఆ పాన్ ఇండియా దర్శకుడితో..
వచ్చే ఎలక్షన్స్ లోపు ఆర్థికంగా ఎంతో కొంత మళ్ళీ నిలదొక్కుకోవాలని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల చేత సినిమాలను రెడీ చేయించుకుంటున్నాడు. ఇక త్వరలో రామ్ తాళ్లూరి ప్రొడక్షన్ లోనే పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సైరా సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా క్రేజ్ అందుకున్న సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం.

బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని
సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో సురేందర్ రెడ్డి ఆలస్యం అయినా కూడా నెక్స్ట్ సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే కొంతమంది యువ హీరోలను సంప్రదించాడు. రామ్ పోతినేని, అఖిల్ అక్కినేనిలతో కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కోసం ఆ స్టార్ రైటర్
ఇక పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రానున్నట్లు చాలా బలంగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇక వీరి కలయికలో తెరకెక్కబోతున్న సినిమాకు కథ అందిస్తోంది మరెవరో కాదు. స్టార్ సీనియర్ రైటర్ వక్కంతం వంశీ. కిక్, రేసు గుర్రం వంటి కథలను అందించి సురేందర్ రేడ్డితో గత కొన్నేళ్లుగా ట్రావెల్ అవుతున్న వంశీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఆ రెండు సినిమాల తరువాతే..
డైరెక్టర్ గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో వంశీ మళ్ళీ మరో సినిమాను స్టార్ట్ చేయలేదు. కానీ గీత ఆర్ట్స్ లోనే ఉంటూ కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కోసం కథ రాయగా.. దాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాల తరువాత పవన్ సురేందర్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











