ప్రభాస్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీ.. మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత మరోసారి భీమ్లా నాయక్ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరొక పవర్ఫుల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ లైనప్ లో మరో రెండు సినిమాలు ఉండగా మరొక 2 రీమేక్ సినిమాలను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా సాహో దర్శకుడు సుజిత్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు గా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Recommended Video

నెంబర్ వన్ భీమ్లా నాయక్
పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతాయని మరోసారి రుజువయింది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి అభిమానులను అంచనాలను అందుకోవటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధికంగా 60 కోట్ల పైగా షేర్ వసూలు అందుకున్న తెలుగు సినిమాగా కూడా రికార్డును క్రియేట్ చేసింది.

16వ శతాబ్దంలో..
భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఒప్పుకునే విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా పిరియాడిక్ హిస్టారికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 16వ శతాబ్దంలో గజదొంగగా కనిపించబోతున్నాడని సమాచారం.

హరీష్ శంకర్ దర్శకత్వంలో..
అలాగే పవన్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకునే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొత్తం కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. త్వరలోనే దర్శకుడు సినిమాను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

తమిళ దర్శకుడితో..
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో కూడా ఒక తమిళ రీమేక్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ సినిమాలో సాయి ధరంతేజ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ ద్వారానే ఆ సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా..
వరుసగా పవన్ కళ్యాణ్ మరొక తమిళ రీమేక్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు గా ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ తెరి సినిమాకు సినిమాకు రీమేక్ గా రాబోతున్న తెలుగు సినిమాలోనే పవన్ కళ్యాణ్ మరొకసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని సమాచారం.

వచ్చే ఏడాది
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాయి. ఇక అదే సెంటిమెంట్ తో కూడా ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తే బాక్సాఫీస్ మరింత బ్లాస్ట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక సినిమాను దర్శకుడు సూజిత్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది స్టార్ట్ కాబోయే ఈ సినిమాను డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











