Pawan Kalyan: పాలిటిక్స్ కోసం సినిమాల విషయంలో మరో కీలక నిర్ణయం.. అలా చేయక తప్పడం లేదు!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గ్యాప్ రావడంతో మళ్లీ ఎలాగైనా వచ్చే మూడేళ్లలో మాత్రం గ్యాప్ లేకుండా ఉండాలని చూసుకుంటున్నారు. అయితే అందరి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంత ఆశ్చర్యం కలిగించింది. పవన్ కళ్యాణ్ సాధారణంగా పాలిటిక్స్ లోకి రాకముందు రెగ్యులర్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎక్కువ ప్రాజెక్టులను లైన్లో పెట్టడం విశేషం. అయితే ఇటీవల పాలిటిక్స్ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 మళ్ళీ ఎప్పటిలానే భారీ ఓపెనింగ్స్

మళ్ళీ ఎప్పటిలానే భారీ ఓపెనింగ్స్

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా టికెట్ రేట్లు తగ్గకపోయి ఉంటే మరిన్ని సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి అని చెప్పవచ్చు. ఇక వెంటనే మళ్ళీ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా అనేక కారణాల వలన వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది.

వరుసగా సినిమాలు..

వరుసగా సినిమాలు..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా అనంతరం హరిహర వీరమళ్లు కూడా పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతొంది. ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఖుషి నిర్మాత ఏఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది.

సురేందర్ రెడ్డితో కూడా..

సురేందర్ రెడ్డితో కూడా..

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి పూర్తిచేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా ఇటీవల పూర్తయ్యాయి. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ హీరోయిన్స్ సెలక్షన్ విషయంలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ దర్శకుడు అఖిల్ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ తో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టవచ్చు అని తెలుస్తోంది

Recommended Video

Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu
 కొత్త ప్రాజెక్టులను రిజెక్ట్ చేస్తూ..

కొత్త ప్రాజెక్టులను రిజెక్ట్ చేస్తూ..

అయితే ప్రస్తుతం ఈ సినిమాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తిచేయాల్సి ఉంది. అయితే మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలో ఏలాంటి సినిమాలు ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన పవర్ స్టార్ ఇటీవల కొత్త ఆఫర్స్ వచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.. మళ్లీ తన కారణంగా నిర్మాతలను దర్శకులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొత్త ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ రెగ్యులర్ రాజకీయాలతో బిజీగా కావాలనే డిసైడ్ అయ్యాడు. మరి ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పవన్ ఇప్పటికీ పూర్తి చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X