twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం అసిస్టెంట్ గా పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : త్వరలో బ్రహ్మానందం అసెస్టెంట్ గా పవన్ కళ్యాణ్ కనపడి నవ్వులు పూయించనున్నారని సమాచారం. త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టనుంది. బ్రహ్మానదం..రియల్టర్ గా కనిపిస్తే..అతనికి సాయిం చేసే అసెస్టెంట్ పాత్రలో పవన్ కనిపిస్తారు. వీరి ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేసాలు సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం. త్రివిక్రమ్ సీన్ చేస్తూంటే షూటింగ్ లో అందరూ నవ్వు ఆపుకోలేకపోతున్నట్లు చెప్తున్నారు.

    పవన్ కళ్యాణ్, టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం కాంబినేషన్ అంటే నవ్వుల పూవులు పూయాల్సిందే. వీరి కాంబినేషన్‌కు త్రివిక్రమ్ లాంటి వారు అందించే పంచ్ డైలాగులు తోడైతే థియేటర్లో నవ్వుల జడివాన కురవాల్సిందే. ఆ నవ్వుల వాన ఏ రేంజిలో ఉంటుందే జల్సా సినిమా చూసిన వారికి తెలుసు.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మూవీ మంచి కామెడీ పండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.

    English summary
    Pawan Kalyan is currently acting in a film titled "Saradha" in the direction of Trivikram Srinivas.Currently the film shooting is progressing in Ramoji Film City in Hyderabad.There the film unit is canning few scenes involved on the lead pair in specially erected house sets in RFC.Now the latest buzz is that Comedian Brahmanandam, who is a crucial for the film is playing the role of real estate agent and Pawan Kalyan will be seen as his assistant in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X