హాట్ న్యూస్ : NRI గా పవన్‌ కల్యాణ్‌

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యణ్ త్వరలో వెండితెరపై ఎన్నారై గా కనిపించి అలరించనున్నట్లు సమాచారం. స్పెయిన్ లో ఉండే ఎన్నారై ఇండియా వచ్చినప్పుడు జరిగే కథతో ఆయన తాజా చిత్రం తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఎన్నారై గెటప్ లో పవన్ సూపర్బ్ ఉంటాడని, విదేశాల్లో ఉండే అభిమానులు సైతం ఐడింటిఫై చేసుకునేలా కథ,కథనం ఉంటాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఊ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత చెప్తూ...''ఆద్యంతం సరదాలు పంచే కథ ఇది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'జల్సా'కి మించిన వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నాం. బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు'' అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రంతో బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం మార్చి 1 నుంచి సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మూవీ మంచి కామెడీ పండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.

'జల్సా'తో సంజయ్‌ సాహుగా వినోదాన్ని పంచారు వవన్‌ కల్యాణ్‌. ఆయన నటన అభిమానులను అలరించింది. త్రివిక్రమ్‌ ఈ కథని తీర్చిదిద్దిన విధానం ఈ చిత్ర విజయంలో ముఖ్య భూమిక పోషించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి వినోదాల విందు పంచడానికి సిద్ధమయ్యారు. 'సరదా' అనే పేరు పరిశీలనలో ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. సమంత హీరోయిన్. సహనిర్మాతలు: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, భోగవల్లి బాపినీడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X