దిల్‌రాజును టెన్షన్ పెడుతున్న క్రిష్.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

కరోనావైరస్ పరిస్థితులు సినీ ప్రముఖుల్లో టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు రిలీజ్ నోచుకోని స్థితి ఉండటంతో నిర్మాతలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్న నిర్మాత దిల్ రాజు‌కు ఊరట లభించింది. అనుకొన్న సమయంలో వకీల్ సాబ్ రిలీజ్ కాకపోవడంతో టెన్షన్ పడుతున్న ఆయనకు పవన్ కల్యాణ్ నుంచి ఓదార్పు లభించిందనే తాజా వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. వివరాల్లోకి వెళితే..

క్రిష్ ప్రాజెక్ట్ వేగంగా

క్రిష్ ప్రాజెక్ట్ వేగంగా

లాక్‌డౌన్ సమయంలో పవన్ కల్యాణ్ తన సినిమాలపై దృష్టిపెట్టారు. స్క్రిప్టు, పోస్టు ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఒకసారి పరిస్థితులు సాధారణస్థాయికి చేరుకోగానే సెట్స్‌పైకి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. తన కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కనున్న క్రిష్ సినిమాను చకచకా పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా క్రిష్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం దిల్ రాజుకు ఇబ్బందిగా మారిందనేది తాజా న్యూస్.

దిల్ రాజు టెన్షన్‌కు కారణం

దిల్ రాజు టెన్షన్‌కు కారణం

వకీల్ సాబ్‌ను పక్కన పెట్టి క్రిష్ రూపొందించే విరూపాక్ష సినిమాతో పవన్ ముందుకెళ్తాడానే అనుమానం దిల్ రాజులో తలెత్తిందంట. ఎందుకంటే.. వకీల్ సాబ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. కొద్దిరోజులు షూటింగ్ మిగిలి ఉండటం, కరోనా కారణంగా షూట్స్ వాయిదా పడటంతో దిల్ రాజు వకీల్ సాబ్‌ను సరైన సమయంలో పూర్తి చేయలేకపోవడానికి కారణమైంది.

విరూపక్ష కంటే ముందుగానే

విరూపక్ష కంటే ముందుగానే

ఇలాంటి సమయంలో దిల్ రాజు పరిస్థితిని అర్ధం చేసుకొన్న పవన్ కల్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చారట. మొదట వకీల్ సాబ్ పూర్తయిన వెంటనే తాను విరూపాక్ష సినిమాలోకి వెళ్తానని, అందులో ఎలాంటి సందేహం లేదు అని హామీ ఇచ్చారట. వకీల్ సాబ్ పూర్తి కావడానికి ఎక్కువ కాల్షీట్లు, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను అని చెప్పారట.

ఇంకా 25 రోజుల షూటింగ్

ఇంకా 25 రోజుల షూటింగ్

తాజా సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ కోసం ఇంకా 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. కోర్టు సీన్లకు సంబంధించి ఎక్కువ సీన్లు షూట్ చేయాల్సి ఉందట. అంతేకాకుండా పవన్ కల్యాణ్‌పై ఓ పాటను చిత్రీకరించాలని, అందుకోసం హీరోయిన్ వేటలో ఉన్నారనేది తెలిసింది.

Recommended Video

Vakeel Saab : Key Changes In Pawan Kalyan's Vakeel Saab Movie
 వకీల్ సాబ్‌తో రీఎంట్రీ

వకీల్ సాబ్‌తో రీఎంట్రీ

టాలీవుడ్‌కు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ వకీల్ సాబ్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీలో విజయం సాధింవచిన పింక్ చిత్రానికి రీమేక్ అనేది తెలిసిందే. బోనికపూర్; దిల్ రాజు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X