'రచ్చ'ఆడియోకు స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్
త్వరలో రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియో పంక్షన్ జరగనుంది. ఈ ఆడియో పంక్షన్ కు పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ మెగా కుటంబాల మధ్య విభేధాలు చోటు చేసుకున్నాయనుకున్న నేపధ్యంలో పవన్ ప్రత్యేకంగా డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని ఆ రోజుకు హాజరవుతారని చెప్తున్నారు. రామ్ చరణ్ ప్రత్యేకంగా తన బాబాయ్ ని కలిసి ఇన్వైట్ చేసాడని తెలుస్తోంది. మరో ప్రక్క పవన్ రీసెంట్ గా నితిన్ ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి సైతం రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ఆడియో పంక్షన్ కి వెళ్లి తన సినిమా పంక్షన్ కి రాకబోయే రకరకాల కామెంట్స్ మీడియో లో వినాల్సి వస్తుందని కూడా చరణ్ ఆలోచించే ఈ ఏర్పాటు చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు.
ఇక 'రచ్చ' ఆడియో పంక్షన్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియోని పిబ్రవరి 20న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు,అభిమానులంతా ఆ రోజు హైదరాబాద్ చేరుకునేటట్లు సమాచారాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది.
మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ...అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











