యువ హీరో కోసం పవన్ కళ్యాణ్.. జోరందుకుంటున్న వార్తలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమలకు వెళ్లి ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా పాల్గొన్నారు. త్వరలో రాజకీయ కార్యక్రమాలతో పవన్ బిజీ కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించే అవకాశం లేకపోవడం ఆయన అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. నా పేరు సూర్య థాంక్యూ మీట్ లో సందడి చేరిన పవన్ కళ్యాణ్ వెంటనే నేల టిక్కెట్టు ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మరో యువ హీరో చిత్ర ఆడియో వేడుకకు పవన్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకే రోజు రెండు ఈవెంట్స్‌లో

ఒకే రోజు రెండు ఈవెంట్స్‌లో

నా పేరు సూర్య థాంక్యూ మీట్, నేల టిక్కెట్టు ఆడియో వేడుక ఒకే రోజు జరిగాయి. తీరిక చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఆ రెండు ఈవెంట్స్ కి హాజరయ్యారు. అటు బన్నీతో, ఇటు రవితేజ తేజతో పవన్ కళ్యాణ్ వేదికని పంచుకోవడం మెగా అభిమానులకు పండుగలా మారింది.

 సినిమా ఈవెంట్స్‌కు తక్కువగా

సినిమా ఈవెంట్స్‌కు తక్కువగా

సినిమా ఈవెంట్స్ కు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఇటీవల ఆయన కొన్ని ఈవెంట్స్ కు హాజరవుతుండడం విశేషం. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా నితిన్ సినిమా వేడుకలకు హాజరయ్యారు. ఇష్క్, అ..ఆ, ఛల్ మోహన్ రంగ వంటి చిత్రాల ఆడియో వేడుకలకు పవన్ హాజరై సంగతి తెలిసిందే. మరో యువ హీరో ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సాక్ష్యం ఆడియో వేడుక

సాక్ష్యం ఆడియో వేడుక

యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 26 న జరగనున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ ని సంప్రదించి ఆడియో వేడుకకు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. తన పొలిటికల్ కార్యక్రమాల బిజీ షెడ్యూల్ ఉండడంతో పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదో చూడాల్సి ఉంది.

ఆశలన్నీ ఈ సినిమాపైనే

ఆశలన్నీ ఈ సినిమాపైనే

తాను నటించిన తొలి చిత్రం అల్లుడు శీను మొదలుకొని కమర్షియల్ హీరోగా పేరుతెచ్చుకుందుకు ప్రయత్నిస్తున్నాడు. సాక్ష్యం చిత్రం ద్వారా అయినా తన కోరిక నెరవేరుతుందని బెల్లం కొండ శ్రీనివాస్ ధీమాతో ఉన్నాడు. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X