»   » భార్యను సర్‌ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్?

భార్యను సర్‌ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య రేణు దేశాయ్ వృత్తి రీత్యా కొంతకాలంగా సపరేటుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో పవన్ కళ్యాణ్ తన తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంటే...రేణు దేశాయ్ మహారాష్ట్రలో ఉంటూ మరాఠీ సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంది.

ఇటీవల డిసెంబర్ 4న రేణు దేశాయ్ పుట్టిన రోజు జరిగింది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో లేక పోవడంతో.....ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా పూణె వెళ్లాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషంగా గడిపినట్లు సమాచారం.

మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డాక రేణు దేశాయ్ తన సినిమా కెరీర్‌‍ను ఆయన కోసం త్యాగం చేసింది. బద్రి తర్వాత ఆమె ఇతర హీరోల సినిమాల్లో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ కళ్యాణ్‌తో 'జానీ' చిత్రంలో నటించింది.

పవన్ కళ్యాణ్‌తో రేణు దేశాయ్ సహజీవనం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. వీరు పెళ్లి చేసుకోకుండానే 2004లో అకీరాకు జన్మనిచ్చారు. పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.

English summary
Pawan Kalyan attended his wife Renu Desai Birthday celebrations in Pune. Pawan Kalyan new film 'Gabbar Singh 2' will start in January and it is slated to release on May 11, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu