చరణ్ ఎంగేజ్ మెంట్ లో పవన్ భార్య రేణుదేశాయ్ మిస్సింగ్

By Sindhu

మెగా బ్రదర్స్ మధ్య మనస్పర్థలు నెలకొన్నాయనే వార్తలు జోరుగా ప్రచారం అయిన నేపథ్యంలో స్వయంగా రామ్ చరణ్ ని ఎంగేజ్ మెంట్ వేడుకకు పవన్ కళ్యాణ్ తీసుకురావడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు కలిసి కనిపించక పోవడంతో, రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ కు మనస్పర్ధలు వచ్చాయని వెబ్ మీడియా కోడై కూస్తుంది. ఎప్పటిలానే ఆ రూమర్స్ ను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కలిసి కనిపిస్తారని ఎదురుచూసిన కొందరు అభిమానులకు నిరాశే మిగిలింది. కానీ ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తో పాటు అతని భార్య రేణుదేశాయ్ పాల్గొనకపోవడం మాత్రం చర్చనీయాంశమయ్యింది. కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు విడాకులు వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రేణు ఖండించింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పూణే నుంచి వచ్చిన రేణు అతనిని దగ్గరుండి చూసుకుందనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని, ఇకపై పవన్, రేణు కలిసే ఉంటారని జనాలు చెప్పుకున్నారు. కానీ నిన్న జరిగిన మెగా వేడుకలో చిరంజీవి కుటుంబసభ్యులు అందరూ పాల్గొనప్పటికీ..పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ఈ వేడుకలో కనిపించక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, పవన్ కళ్యాణ్, రేణులు అవకాశం లేదని వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X