బాద్ షా పంక్షన్‌కు పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్?
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. నిర్మాత బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలుసు. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా తనను ఆదుకున్నారని గణేష్ చెప్పుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత.
ఆ సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ బాద్ షా ఆడియో విడుదల కార్యక్రమానికి వస్తారని అందరూ భావించారు. బాద్ షా సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ తేజ హాజరయ్యాడు. నిజానికి, హీరోల మధ్య విభేదాలు పెద్దగా లేవు గానీ నందమూరి, మెగా అభిమానుల మధ్య విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ బాద్ షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరు కాలేదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, మెగా అభిమానులు పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తారు. రామ్ చరణ్ తేజ నాయక్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో అదే జరిగింది. అయితే, అది పవన్ కళ్యాణ్‌కు ఇబ్బంది కలిగించిందని అంటారు. అయితే, నాయక్ సినిమా కార్యక్రమం కుటుంబ వ్యవహారం కాబట్టి ఫరవా లేదు. బాద్ షా సినిమా కార్యక్రమానికి వస్తే అటువంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించారని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉండవచ్చు. అటువంటప్పుడు తాను హాజరైతే గందరగోళం ఏర్పడవచ్చునని పవన్ కళ్యాణ్ అనుమానించారని, అది అనవసరమైన వివాదానికి దారి తీస్తుందని భావించి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారని చెబుతారు.


Click it and Unblock the Notifications











