బ్యాక్ పెయిన్ తో పవన్.. షూటింగ్ నిలిపివేత?

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో హైలెట్ సాంగ్ కెవ్వు కేక షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది ఏర్పడిందని సమాచారం. అన్నపూర్ణలో జరుగుతున్న ఈ పాట షూట్ లో పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్ మరింతగా పెరిందని,దాంతో పాటని పూర్తి చేయలేకపోయాడని వినపడుతోంది. నడుం నెప్పి విపరీతంగా పెరిగిపోవటంతో పవన్ చాలా ఇబ్బంది పడ్డాడని అంతటా చెప్పుకుంటున్నారు. అయితే చిత్రం మే 9 విడుదల తేదీ ఇచ్చి ఉండటంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ లేట్ కానివ్వకుండా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇక గతంలోనే గబ్బర్ సింగ్ యాక్షన్ సన్నివేశంలో గుర్రం మీద నుంచి వచ్చే యాక్షన్ సీన్స్ తీస్తూంటే పవన్ పడ్డారని వినికిడి. అప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి మానేజ్ చేసారు. ఆ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి వెళ్లి ట్రీట్ మెంట్ చేసుకున్నారు. ఇప్పుడదే నెప్పి మళ్లీ తిరగబెట్టిందని చెప్తున్నారు. నెప్పితో స్టెప్స్ వేయటం చాల ఇబ్బంది పడ్డాడని చెప్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని విశాల స్థలంలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్, బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరా, దాదాపు 100 మంది డాన్సర్స్‌తో భారీ ఎత్తున ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్ ట్యూన్స్‌తో కేకపెట్టించేలా రూపొందించారు.

ఇక గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పవర్ స్టార్ ఇప్పటికే పూర్తి చేశారు. అక్కడ పని పూర్తవ్వగానే పాట చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కోరుకున్న విధంగా ఔట్ పుట్ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆడియోలో కెవ్వుకేక పాటే హైలెట్‌గా నిలవడంతో సినిమాలో విజువల్ పరంగా కూడా ఈ పాట దుమ్ము రేపేలా, మాస్ జనాలను థియేటర్ల వైపు లాక్కొచ్చేలా ఉండాలని ట్రై చేస్తున్నారు. నిర్మాత గణేష్ బాబు కూడా ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా దర్శకుడికి స్వేచ్చనిచ్చినట్లు యూనిట్ వర్గాల సమాచారం.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X