పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే.. వరుసగా మూడు సినిమాలు.. తెగ్గేదేలే
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎప్పటిలానే షూటింగ్స్ మొదలయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టడంతో సినిమాల విడుదల తేదీలపై కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతోంది. అయితే కాలం కలిసి వస్తే వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. మూడు పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఒకవైపు ప్రజల సమస్యలు మరోవైపు సినిమా షూటింగ్స్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. వరుసగా సినిమాలనైతే ఎనౌన్స్ చేశాడు. ఒకవైపు ప్రజల సమస్యలు మరోవైపు సినిమా షూటింగ్స్ అంటూ పవన్ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఒక్కో సినిమా ఒక్కోలా తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.

వచ్చే ఏడాది మూడు సినిమాలు
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి నుంచి మొదలైతే ఆ ఏడాది చివర వరకు అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. మధ్యలో ఒక సినిమా చివరలో మరొక మాస్ యాక్షన్ సినిమా రిలీజ్ అవుతుంది.

2022 సంక్రాంతికి రీమేక్ మూవీ
2022 సంక్రాంతికి అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ రావచ్చని తెలుస్తోంది. అసలైతే ఆ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ఆలస్యం అవ్వడం అలానే మిగతా సినిమాలు కూడా పోటీగా ఉండడంతో సినిమాను వాయిదా వేయక తప్పడం లేదు సంక్రాంతికి పవన్ - రానా మూవీ ఫిక్స్ అని తెలుస్తోంది.

సమ్మర్ లో మరో సినిమా
ఇక మరోవైపు హరిహర వీరమల్లు సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ వలన ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏఎమ్.రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చరిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కుదిరితే సమ్మర్ ను టార్గెట్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Recommended Video

వాంటెడ్ కాంబినేషన్
ఇక మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ సినిమాను మరికొన్ని రోజుల్లో స్టార్య్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అనుకున్నట్లు షూటింగ్స్ పూర్తి అయితే వచ్చే ఏడాది మూడు సినిమాలు ఒకేసారి వస్తాయన్నమాట. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా మాత్రమే 2023లో రానుంది.


Click it and Unblock the Notifications











