బాలయ్య-పవన్ కళ్యాణ్ టై అప్.... ఇక బీభత్సమే!

By Bojja Kumar

Pawan Kalyan and Balakrishna's multi-starrer
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైందంటే టిక్కెట్లకు డిమాండ్ ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా నందమూరి నటసింహం బాలయ్య సినిమా రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసి పోవాల్సిందే. మరి ఇలాంటి ఇద్దరు టాప్ స్టార్లు కలిసి సినిమా చేస్తే.....బాక్సాఫీసు కలెక్షన్లు బీభత్సంగా ఉండటం ఖాయం.

ఈ మధ్య తెలుగులో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరుగుతోంది. దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్లు కురిపించే కాంబినేషన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్-మహేష్ బాబు కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. అదే విధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్-వెంకటేస్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం తెరకెక్కుతోంది.

ఈ క్రమంలో కొందరు దర్శకులు, నిర్మాతలు పవన్ కళ్యాణ్, బాలయ్య కాంబినేషన్లో సినిమా చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారట. ఈ మధ్య పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేయడంతో బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య సంబంధాలు బాగున్నాయని.....ఇద్దరినీ ఒప్పించి ఓ సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తున్నారట.

తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా 100 కోట్ల మార్కు దాటలేదు. ఇలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్లు ట్రై చేస్తే.......పరిశ్రమ ఆదాయం, విలువ పెంచవచ్చనేది పలువురి అభిప్రాయం. ఇద్దరి ఇమేజ్‌కు సరిపోయే విధంగా కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి భవిష్యత్‌లో పవన్ కళ్యాణ్-బాలయ్య కాంబినేషన్ సినిమా చూడటం ఖాయంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X