పవన్ గడ్డమే ..గబ్బర్ సింగ్ కి అడ్డమైంది

By Srikanya

పవన్ కళ్యాణ్ కష్టపడి పెంచిన గడ్డమే..గబ్బర్ సింగ్ షూటింగ్ కి అడ్డమైంది అని తెలుస్తోంది. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ పెంచారు. ఈ సినిమా మొత్తం గడ్డం తో కనిపించనున్నారు. కేవలం డ్రీమ్ సాంగ్స్ లోనే గడ్డం ఉండదు. అయితే టాకీ పార్ట్ పూర్తి అయ్యేదాకా గడ్డం మాత్రం తీయవద్దని దర్శకుడు ఆదేశం. దాంతో పవన్ తను లేని సీన్స్ ని గబ్బర్ సింగ్ లో తీయమని హరీష్ శంకర్ ని పురమాయించాడని తెలుస్తోంది. అప్పుడు మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా హీరోయిన్,విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండే సీన్స్ ని హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుని తీయటానికి రేపటి నుంచి సిద్దమవుతున్నారు. ఇక గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక కాళి విషయానికి వస్తే పవన్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా విష్ణువర్థన్ ఈ చిత్రంలో మసాలా అంశాలని జోడిస్తున్నాడు. సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌ సరసన సారా జేన్‌ డయాస్‌, అంజలీ లావానియా నటిస్తున్నారు.ఈ చిత్రం గురించి దర్శకుడు విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ...'ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పవన్‌ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో సినిమా చాలా స్టెయిలిష్‌గా ఉంటుంది' అన్నారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాహుల్ కోడా, కెమెరా .ఎస్.వినోద్, కూర్పు ఎ.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్ శ్యామ్ కౌశల్, కళ సునీల్ ‌బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X