Pawan Kalyan: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భవధీయుడు భగత్ సింగ్.. వచ్చేది ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అసలు సినిమాలు చేస్తాడా లేదా అని అనుకుంటున్న తరుణంలో ఒకేసారి వరుసగా నాలుగు సినిమాలును లైన్ లో పెట్టడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. చివరగా వచ్చిన వకీల్ సాబ్ తరహాలోనే పవర్ స్టార్ ఆ తర్వాత సినిమాలతో కూడా బిగ్ హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ లైనప్ లో నాలుగు సినిమాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే భవదీయుడు భగత్ సింగ్ రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

కమర్షియల్ పాయింట్స్ ఎన్ని ఉన్నా..

కమర్షియల్ పాయింట్స్ ఎన్ని ఉన్నా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవల కాలంలో అయితే మంచి సందేశం ఉండేలా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. కమర్షియల్ పాయింట్స్ ఎన్ని ఉన్నా కూడా అభిమానులకు జనాలకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్ చేసుకున్న సినిమాలపై బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వకీల్ సాబ్ సినిమాపై రాజకీయాల ప్రభావం కూడా గట్టిగానే పడినట్లు అర్థమైంది. లేదంటే సినిమా మరిన్ని వసూళ్లను అందుకునేదని కూడా టాక్ వచ్చింది.

భీమ్లా నాయక్ తో బిజీగా..

భీమ్లా నాయక్ తో బిజీగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రానా దగ్గుబాటి మరొక ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుండగా నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ అయితే చాలా నమ్మకంతో ముందుకు వెళుతుంది.

 టార్గెట్ సెట్ చేసుకున్న పవన్

టార్గెట్ సెట్ చేసుకున్న పవన్

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు.

భవదీయుడు భగత్ సింగ్ రిలీజ్..

భవదీయుడు భగత్ సింగ్ రిలీజ్..

భవదీయుడు భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఈ సారి కూడా సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. భవదీయుడు భగత్ సింగ్ లో మంచి కమర్షియల్ అంశాలతో పాటు పొలిటికల్ డ్రామా తో మంచి సందేశం కూడా ఉంటుందన్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 5: తగ్గని VJ Sunny క్రేజ్, ఇంతకీ అప్పడం అన్నాడా ? || Filmibeat Telugu
 డేట్ ఫిక్స్ చేసుకున్న హరీష్ శంకర్

డేట్ ఫిక్స్ చేసుకున్న హరీష్ శంకర్

వచ్చే ఏడాది కూడా రిలీజ్ డేట్స్ దొరకడం చాలా కష్టం గానే ఉంటుంది. ముఖ్యంగా పండగ సీజన్లో పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా ముందుగానే ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది అని దర్శకుడు హరీష్ శంకర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2022 అక్టోబర్ 5వ తేదీన భగత్ సింగ్ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X