Bheemla Nayak: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ షోలు ఎక్కడెక్కడ అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమా మొత్తానికి విడుదల కావడానికి సిద్ధమైంది. వకీల్ సాబ్ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న డిఫరెంట్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కూడా అనిపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ షోలపై కూడా ఇటీవల నిర్మాతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రత్యేకంగా కొన్ని సెంటర్లలో విడుదలకు ఒక రోజు ముందు అర్ధరాత్రి నుంచి ఫ్యాషన్ షో లు ప్రదర్శించబడతాయి అని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ సెన్సేషన్.. పక్కా..

బాక్సాఫీస్ సెన్సేషన్.. పక్కా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత వకీల్ సాబ్ సినిమాతో బాగానే ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా సంతృప్తి పరచలేక పోయింది. బాక్సాఫీసు వద్ద కూడా సినిమా టోటల్ గా భారీ స్థాయిలో వసూళ్లను కూడా సాధించలేదు. అయితే ఈసారి ఫుల్ యాక్షన్ డ్రామా గా రాబోతున్న భీమ్లా నాయక్ మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తోంది. ఈ సినిమా మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా రానుంది.

100 ఆక్యుపెన్సీ..

100 ఆక్యుపెన్సీ..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పుష్ప సినిమా తర్వాత మరొక పెద్ద సినిమా రాలేదు. సంక్రాంతికి కావాల్సిన పెద్ద సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇక భీమ్లా నాయక్ కూడా మిగతా సినిమాల కోసం వెనుకడుగు వేయక తప్పలేదు. అయితే ఈ సినిమాను మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 100% ఆక్యుపెన్సీ ఉండడంతో ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మొదటి షో చూడాలని..

మొదటి షో చూడాలని..

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఒక వారం ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి ఫ్యాన్స్ షోల వరకు ఎక్కడెక్కడ ప్రదర్శిస్తున్నారు అనే విషయంలో అనేక రకాల విషయాలు చర్చలోకి వస్తూ ఉంటాయి. ఇక భీమ్లా నాయక్ సినిమా పై కూడా ప్రస్తుతం అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ అభిమానులు అందరి కంటే ముందుగా సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 హైదరాబాద్ లోనే ఫ్యాన్స్ షోస్

హైదరాబాద్ లోనే ఫ్యాన్స్ షోస్

ఇక భీమ్లా నాయక్ సినిమా కు సంబంధించిన ఫాన్స్ షోలో హైదరాబాద్ లో అయితే తప్పకుండా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత నాగవంశి పలు థియేటర్స్ యాజమాన్యంతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ప్రముఖ మాస్ ఏరియాలలో ప్రత్యేకంగా అభిమానులకు సంబంధించిన షోలను ప్రదర్శించనున్నారట. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు కాని హైదరాబాదులో అయితే తప్పకుండా ఉంటాయని తెలుస్తోంది

టికెట్ల రేట్లు భారీగానే..?

టికెట్ల రేట్లు భారీగానే..?

అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే షోల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. గతంలోనే వకీల్ సాబ్ సినిమా ఫ్యాన్స్ షోల కోసం ఒక్కో టికెట్ ధర ఏడు వందలకు పైగానే అమ్ముడయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాపై అంతకుమించి అంచనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వెయ్యి రూపాయలు అమ్ముడు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X