Don't Miss!
- News
టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి బొత్స కామెంట్స్
- Sports
రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Pawan Kalyan: ఆ సమయానికి భీమ్లా నాయక్ వస్తే.. ఓటీటీ డేట్ కూడా ఫిక్స్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా కారణంగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా కూడా లేకుండా వాయిదా వరుసగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా గత ఏడాది నుంచి వాయిదా పడుతూనే ఉంది. అసలైతే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.
కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చిత్రయూనిట్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో గాని ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇటీవల చిత్ర నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

RRR కారణంగా..
కరోనా కారణంగా సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు ఒక్కసారిగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ సమయానికి పవన్ కళ్యాణ్ సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. RRR సినిమా నిర్మాతల నుంచి కొంత అసంతృప్తి రావడంతో చర్చలతో సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు RRR కు కూడా ఏమాత్రం అనుకూలించ లేదు. ఏదేమైనా కూడా భీమ్ల్ నాయక్ సినిమా సంక్రాంతి ఫెస్టివల్ ను మిస్ చేసుకుంది అనే చెప్పాలి.

పాజిటివ్ బజ్
రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ సినిమా మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. తప్పకుండా సినిమా అంచనాలకు మించి అనేలా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. విడుదలైన టీజర్ సాంగ్స్ కూడా మంచి బజ్ పెంచేశాయి. ఇక ఫిబ్రవరి 25 న ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

మళ్ళీ వాయిదా పడితే..
ఇక రానున్న రోజుల్లో కరోనా పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరికొన్ని సార్లు థియేటర్లు మూత పడే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అయితే భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవేళ వాయిదా వేస్తే మార్చి లో వచ్చే అవకాశం ఉందట. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఓటీటీలో ఎప్పుడంటే?
అయితే ఇటీవల చిత్ర నిర్మాత నాగవంశి ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ఆహా సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమా అనుకున్న సమయానికి ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తే ఓటీటీలో మార్చి చివరి వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇటీవల జరిగినట్లు తెలుస్తోంది. మరి భీమ్లా నాయక్ సినిమా అనుకున్న సమయానికి ఓటీటీలోకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.