పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు ఊహించని షాక్.. సంక్రాంతి బరిలో నుంచి ఔట్.. అసలు ఏమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండగా తాజాగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

క్రేజీ కాంబో

క్రేజీ కాంబో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు.. మలయాళంలో బిజు మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో ఈ సినిమా చూసి నచ్చడంతో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా హక్కులు కొనుక్కున్నారు.

క్లారిటీ లేదు

క్లారిటీ లేదు

అలా ఎట్టకేలకు రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రధారులుగా ఈ సినిమాను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాణా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇక ఈ సినిమా జనవరి 12 వ తేదీన విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ కారణాలతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ఎందుకు వాయిదా పడింది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సినిమా వాయిదా పడింది అని మాత్రం తెలుస్తోంది

 త్వరలో కొత్త రిలీజ్ డేట్

త్వరలో కొత్త రిలీజ్ డేట్

ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులైతే దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎందుకు వాయిదా వేస్తారు ? మా సినిమా వాయిదా వేయడం జరగదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వంశీ చేసిన ట్వీట్

వంశీ చేసిన ట్వీట్

అంతేకాక కొద్ది రోజుల క్రితం 12 జనవరి 2022 సంవత్సరంలో సినిమా థియేటర్ లలో కలుసుకుందామని కొద్ది రోజుల క్రితం నాగ వంశీ చేసిన ట్వీట్ ను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి ఈసారి మిస్ అవ్వదు అని ఆయన పేర్కొన్నారు ఎందుకంటే గత ఏడాది సరిగ్గా అదే రోజున అల వైకుంఠపురం లో సినిమా విడుదల కాగా ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాక నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతుందనే అంశం మీద ఎలాంటి క్లారిటీ మాత్రం రావడం లేదు.

బంగార్రాజు సంక్రాంతికి

బంగార్రాజు సంక్రాంతికి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రేసు నుంచి బయటకు రావడంతో ఆ డేట్ ను మరో పెద్ద సినిమా తీసుకోవచ్చని ప్రచారం జరుగుతూ ఉండగా బంగార్రాజు యూనిట్ కూడా సంక్రాంతికి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భీమ్లా నాయక్ డేట్ ని మరో పెద్ద సినిమా ఆక్రమించినా సరే సంక్రాంతి సీజన్ కి బంగార్రాజు రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X