పవన్ ఫాన్స్ ను వదలని టెన్షన్.. సంక్రాంతి బరిలో నుంచి ఔట్.. ఈసారి ఏమంటారో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా విషయంలో పవన్ ఫాన్స్ కి టెన్షన్ నెలకొంది. ఇప్పటిదాకా ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండగా తాజాగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగులో రీమేక్

తెలుగులో రీమేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు.. మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అక్కడ అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అమెజాన్ ప్రైమ్ లో విడుదల

అమెజాన్ ప్రైమ్ లో విడుదల

సరిగ్గా లాక్ డౌన్ కు ముందు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆలా మలయాళంలో ఈ సినిమా చూసి నచ్చడంతో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ వెంటనే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. అలా ఎట్టకేలకు రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రధారులుగా ఈ సినిమాను ప్రారంభించారు.

సినిమా వాయిదా

సినిమా వాయిదా

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాణా సరసన మలయాళ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానున్నట్లు ముందే అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాలతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ఎందుకు వాయిదా పడింది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సినిమా వాయిదా పడింది అని మాత్రం ప్రచారం మొదలైంది.

అనుకున్న రోజునే విడుదల

అనుకున్న రోజునే విడుదల

కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే ప్రచారం జరగగా సదరు వార్తలపై స్పందించిన మూవీ టీమ్‌ 'అనుకున్న రోజునే విడుదల చేస్తాం' అని క్లారిటీ ఇచ్చింది. 'ఈ సినిమా సంక్రాంతికి లేనట్టే' అనే కథనాలు నెట్టింట మళ్లీ దర్శనమిస్తుండటంతో నాగవంశీ మరోసారి స్పష్టతనిచ్చించ్చారు. ''భీమ్లా నాయక్‌'.. 2022 జనవరి 12న మీ ముందుకు వస్తుంది' అని కూడా వెల్లడించారు.

రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించే అవకాశం

రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించే అవకాశం

అయితే ఇప్పుడు మాత్రం సినిమా వాయిదా పడనుంది అని అంటున్నారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులైతే దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రేసులో ఇప్పటికే భారీ సినిమాలు ఉన్న కారణంగా విడుదల వాయిదా వేస్తున్నారు అని అంటున్నారు.

స్క్రీన్ ప్లే రైటర్‌గా

స్క్రీన్ ప్లే రైటర్‌గా

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. కేవలం పవన్ కోసమే ఆయన తన స్థాయి తగ్గించుకుని మరీ స్క్రీన్ ప్లే రైటర్‌గా మారి సినిమాకు పని చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడబోతుందన్న ప్రచారం వైరల్ అవుతోంది. ఈసారి ఏమని మేకర్స్ క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X