Bheemla Nayak Trailer: ట్రైలర్ హైలైట్స్ లీక్.. అన్ని నిమిషాల రచ్చ.. చివర్లో మాత్రం షాకింగ్‌గా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్నింటికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిలో క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పేరు మారుమ్రోగిపోతోంది. ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక, ఈరోజే 'భీమ్లా నాయక్' ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ట్రైలర్‌కు సంబంధించిన హైలైట్లు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరూ చూడండి మరి!

ప్రతిష్టాత్మకంగా వస్తోన్న భీమ్లా
స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వస్తోన్న భారీ చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

సినిమాలో హీరోల రోల్స్ ఇలా
మలయాళంలో వచ్చి హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ రీమేక్‌గా తెరకెక్కింది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో ఈ సినిమా రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా చేశారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ దక్కింది.

భీమ్లా బిజినెస్ భారీ స్థాయిలో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియుల ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ భారీ రేంజ్‌లో జరిగిందని తెలిసింది.

రిలీజ్‌కు రెడీ... ఫ్యాన్స్ రచ్చ
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీ విడుదలపై చాలా రోజుల పాటు సందిగ్ధత నెలకొంది. దీంతో ఇది ఇప్పుడు వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఫీవర్ మొదలైంది. పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈరోజే భీమ్లా నాయక్ ట్రైలర్
పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడింది. దీంతో ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 21 అంటే ఈరోజే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందుగానే ప్లాన్ చేసుకుంది. దీంతో అటు పవన్ అభిమానులు, ఇటు రానా ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇది ట్రెండ్ అయిపోయింది.

ట్రైలర్ హైలైట్లు బయటకు
భారీ బడ్జెట్, పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని కట్ చేశారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వీడియో 2 నిమిషాల 14 సెకెన్ల నిడివితో వస్తుందట. ఇందులో పవన్ విశ్వరూపాన్ని చూపించారని తెలిసింది. అలాగే, రానా పాత్రకూ బాగానే ప్రాధాన్యం ఇచ్చారట.

చివర్లో మాత్రం షాకింగ్‌గానే!
'భీమ్లా నాయక్' ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ ఎలివేషన్ సీన్స్ హైలైట్ కాబోతున్నాయట. అలాగే, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఈ వీడియో చివర్లో పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఊహించని విధంగా ఉంటుందట. అంతేకాదు, లాస్ట్ విజువల్ అందరికీ షాకిచ్చేలా డిజైన్ చేశారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.


Click it and Unblock the Notifications











