అకీరా ఆద్యలకు పవన్ కాస్ట్లీ గిఫ్ట్.. ఆ బంగ్లా విలువ ఎంతంటే..?
Recommended Video
పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ వేరు పడినా.. అకీరా నందన్, ఆద్యలు మాత్రం పవన్‌తో, మెగా ఫ్యామిలీతో కలిసే ఉంటారు. మెగా ఇంట్లో ఏ సెలెబ్రేషన్స్ జరిగినా వీరిద్దరు హాజరు కావాల్సిందే. వారిద్దరిని మెగా ఫ్యామిలీ అంత బాగా చూసుకుంటారు మరి. అయితే ఇన్నాళ్లు పుణెలో ఉన్న అకీరా, ఆద్యలు హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని, వారి కోసం ఓ ఖరీదైన బంగ్లాను కొనిచ్చాడని, అకీరాను వెండితెరకు పరిచయం చేయబోతోన్నాడని ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

ఇన్నాళ్లూ పుణెలో..
రేణు దేశాయ్‌కు సంబంధించిన కుటుంబం పుణెలో ఉండటం చేత.. ఆమె అక్కడికి వెళ్లి స్థిరపడింది. పవన్‌తో విడాకులు అయ్యాక ఇక్కడ ఉండటం మంచిది కాదని భావించిన రేణు దేశాయ్ అకీరా, ఆద్యలను తీసుకుని పుణెకు వెళ్లిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో భాగంగా రేణు దేశాయ్ హైద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను గాలిస్తోంది. ఈ క్రమంలో వికారబాద్ జిల్లాను జల్లెడ పడుతోంది.

హైద్రాబాద్‌లో ఫిక్స్..
ఇక రేణు దేశాయ్ పుణెకు పూర్తిగా వీడ్కోలు చెప్పినట్టు తెలుస్తోంది. హైద్రాబాద్‌లోనే ఉండి తన కార్యకలాపాలు చూసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన పిల్లల అకీరా, ఆద్యలు ఉండటానికి ఓ విలాసవంతమైన భవనాన్ని కూడా పవన్ కళ్యాణ్ కొనేశాడని తెలుస్తోంది. ఈ విషయం గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

సకల వసతులతో కూడిన బంగ్లా..
గచ్చిబౌలి ఏరియాలో అన్ని వసతులతో కూడిన ఓ విలాసవంతమైన బంగ్లాను అకీరా, ఆద్యలకు ఇచ్చాడని తెలుస్తోంది. దాదపు ఐదారు కోట్ల విలువైన ఆ బంగ్లాలోనే ఇకనుంచి ఉంటారని సమాచారం. అంతేకాకుండా అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే ఎంట్రీ..
అకీరా నందన్‌ను మెగా ఫ్యాన్స్ ముద్దుగా జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. అతని చూపులు, అతని నడక, హైట్ ఇలా ప్రతీది పవన్ పోలి ఉండటంతో సినిమాల్లోకే వస్తాడని అందరూ ఫిక్స్ అయ్యారు. తాజా సన్నివేశం కూడా అదే చెబుతోంది. నటనలో శిక్షణ తీసుకుని.. త్వరలోనే ఓ సినిమాతో ఎంట్రీ ఇస్తాడని సమాచారం. అయితే వీటిపై అటు పవన్ గానీ రేణు దేశాయ్ గానీ స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











