మాస్ డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. అఖండ హిట్ తర్వాత పవన్ నుంచి పిలుపు.. దాని కోసమే వెయిటింగ్?

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడడంతో అసలు ఆ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ప్రకటించ లేని పరిస్థితి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇప్పుడు ఏకంగా మాస డైరెక్టర్ తో బోయపాటి శ్రీనుతో సినిమా ఫైనల్ చేశారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bheemla Nayak : Trivikram Srinivas Charges Rs 15 Crore For Pawan's Movie || Filmibeat Telugu
 వకీల్ సాబ్ సూపర్ హిట్ తో

వకీల్ సాబ్ సూపర్ హిట్ తో

హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ అనే సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. పవన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతి హసన్ ఆయన భార్యగా నటించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది.

మహాశివరాత్రి సందర్భంగా

మహాశివరాత్రి సందర్భంగా

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలు ఒప్పుకున్నాడు. భీమ్లా నాయక్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో సినిమాను ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నారు.

వరుస సినిమాలతో

వరుస సినిమాలతో

ఇక ఆ సినిమాలు కాకుండా హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అకాగే బండ్ల గణేష్ తో ఒక సినిమా, సురేందర్ రెడ్డితో ఒక సినిమా కూడా ఒప్పుకున్నారు. నిజానికి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్ల సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు నుంచి భావిస్తూ వచ్చారు. కానీ ఆ సినిమా షూటింగ్ అప్పటికి పూర్తి చేసి రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉండంతో సమ్మర్ సీజన్ లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

బోయపాటితో మాస్ కాంబో

బోయపాటితో మాస్ కాంబో

బిజీ షెడ్యూల్‌స్ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకుడుగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విరామం తీసుకునే మూడ్‌లో లేడని అంటున్నారు. సరైన కథాంశంతో తనను సంప్రదించే ఇతర దర్శకులకు డేట్లు ఇవ్వడానికి అతను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఇటీవల బాలకృష్ణతో అఖండ చిత్రాన్ని అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా పవన్ ఒక సినిమా చేయచ్చని అంటున్నారు. డిసెంబర్ 2న విడుదలైన అఖండ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుండగా, దర్శకుడు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందవలసి ఉంది.

అప్పటి దాకా పుకారే

అప్పటి దాకా పుకారే

అల్లు అర్జున్‌తో సరైనోడు, రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రాలను రూపొందించిన బోయపాటి.. మెగాస్టార్ చిరంజీవికి కథను సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ, ఈ మాస్ ఫిల్మ్ మేకర్‌కి పవన్ నుండి ఆఫర్ ఊహించని విధంగా వచ్చిందని అంటున్నారు. అయితే, ఈ వార్తపై అధికారిక ధృవీకరణ లేదు. ఇది ఇప్పటికీ పుకారుగానే ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X