BRO: స్పెషల్ సాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ.. వరుసగా ఇది మూడోసారి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సితంకి ఇది రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పన్స్ కూడా వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని చిత్ర యూనిట్ ఇదివరకే తెలిపింది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న బ్రో సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అప్డేట్స్ ను వదులుతున్నారు మేకర్స్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని తెలుస్తుంది. దాని కోసం కాస్ట్ లీ పబ్ సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తుంది.

ఇక ఈ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. పవన్ , సాయిధరమ్ తేజ్ లతో కలిసి ఊర్వశి చిందులు వేయనున్నట్లు టాక్. ఇటీవల టాలీవుడ్ లో వరుసగా స్పెషల్ సాంగ్స్ లో ఛాన్స్ దక్కించుకుంటుంది. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య లో స్పెషల్ సాంగ్ చేసిన అమ్మడు ఆ తరువాత అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా కనిపించింది. ఇక టాలీవుడ్ లో అమ్మడు వెంటవెంటనే మూడోసారి మరో ఆఫర్ అందుకుంది.
బ్రో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కి ఊర్వశి రౌతేలాను తీసుకున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంత కాస్ట్ లీ పబ్ ను ఇప్పటివరకు నిర్మించలేరని ఇన్ సైడ్ టక్. ఒక యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు.

దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేసి మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











