Andhra Elections నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి.. పవన్ కల్యాణ్ బంపర్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల వాతవారణం వేసవికాలాన్ని మించి వేడెక్కిస్తున్నది. త్వరలో జరుగునున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎత్తులుపై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో జనసేన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు టీడీపీతో కలిసి పొత్తుల వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నది. అయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో తన సోదరుడు నాగబాబుకు కేంద్రమంత్రి పదవికి వచ్చేలా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్లాన్ అదిరిపోయేలా ఉందనే విషయాన్ని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. పవర్ స్టార్ బంపర్ ప్లాన్ వివరాల్లోకి వెళితే..
డబ్బు, మద్యం రహిత ఎన్నికల్లో భాగంగా కావాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ క్రమంలో ఎన్నికల్లో మినిమం ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేసి నిజాయితీగా ఓట్లు సంపాదించాడు. అయితే గెలుపును మాత్రం చేజిక్కించుకోలేకపోయాడు. దాంతో ఈసారి ఎన్నికల్లో తన ఎజెండాను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తున్నది.

ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. డబ్బు ఖర్చు చేయాల్సిందే. నేతలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉండాలి. ఒకవేళ డబ్బు ఖర్చు చేయడానికి అవసరం లేకపోతే ఇంకా మంచిది అని తన ఉద్దేశాన్ని క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేశాడు.
తన వ్యూహాంలో భాగంగా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. అన్నయ్య నాగబాబు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు. కాబట్టి ఆయన పోటీ చేయబోయే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి గెలువడానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుచేత పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

రాష్ట్రంలోని అధికార ప్రభుత్వాన్ని ఢికొట్టాలంటే.. ముల్లును ముల్లుతో తియాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ వ్యూహాన్ని రచించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నాగబాబు గెలుపు కోసం విశాఖకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు నిధులు సేకరించే పనిని అప్పగించినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











