ప్రస్తుతం పవన్ ఎక్కడ...ఏం చేస్తున్నారు?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 9న విడుదల కావాల్సి ఉండగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల కారణంగా విడుదల నిలిపి వేసిసన సంగతి తెలిసిందే. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేకున్నా....ఆగస్టు 21న సినిమా చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే మరి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు...ప్రమేషన్ కార్యక్రమాల్లో ఇంటర్వూలు వంటివి ఇస్తారా వంటి వాటిపై ఫ్యాన్స్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ..బెంగుళూరులో రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ ఆయన తన తదుపరి చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. సంపత్ నందితో చేయబోయే గబ్బర్ సింగ్ 2 కి ఆయన వర్క్ చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఈ స్క్రిప్టులో ఆయన పూర్తిగా నిమగ్నమై ఉన్నారని,ఆ చిత్రం ఓ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలపాలనే ఆలోచనలో ఆయన పని చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్, సంపత్ నంది కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్ - 2 ' రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ విషయమై తొలిసారిగా సంపత్ నంది మీడియా ముందు పెదవి విప్పారు. ఆయన చిత్రం గురించి డిటేల్స్ ఇచ్చారు. బయిట ప్రచారం అవుతున్న రూమర్స్ ను ఖండిస్తూ వివరణ ఇచ్చారు.
సంపత్ నంది మాట్లాడుతూ... ''గబ్బర్ సింగ్ ఛాయలతో సాగుతుంది పవన్‌కల్యాణ్‌తో చేయబోయే చిత్రం. అయితే ఇది 'దబాంగ్ 2'కి రీమేక్ మాత్రం కాదు. పూర్తిగా కొత్త కథ. గబ్బర్ సింగ్ అనేది నా దృష్టిలో ఓ బ్రాండ్. ఆ పాత్ర తీరుతెన్నులు, విధానం... అన్నీ ప్రత్యేకమే. వాటిని ఆధారంగా చేసుకొని ఎన్ని భాగాలైనా తీయొచ్చు. పవన్‌కల్యాణ్ అంతగా ఆ పాత్రకు జీవం పోశారు. గబ్బర్ సింగ్‌లో ఉన్నంత వినోదం, పంచ్ డైలాగులు, వాణిజ్యాంశాలు... ఇందులోనూ ఉంటాయి. ఆయన అభిమానుల్ని, ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచను'' అన్నారు.
అలాగే ''మనం అనుకున్న కథను స్టార్ హీరోలకు తగ్గ రీతిలో మలచుకోవాలి. రజనీకాంత్ సినిమాలకు వెళ్లాక ఆయన శైలి మేనరిజమ్స్, పంచ్‌లు లేకపోతే నిరుత్సాహపడతాం కదా. కాబట్టి అభిమానుల కోణంలోనూ ఆలోచించాలనుకొంటాను. అప్పుడు రచ్చ కావచ్చు... ఇప్పుడు పవన్‌కల్యాణ్ సినిమాకైనా ఆ విధానంలోనే నా కథను తెరపైన చూపిస్తాను'' అన్నారు.
ఇక ...''రచ్చ సినిమాలోని టైటిల్ గీతం అంటే పవన్‌కల్యాణ్‌గారికి ఇష్టం. ఆ సినిమా విడుదలయ్యాక కళా దర్శకుడు ఆనంద్ సాయి ద్వారా కలిశాను. కథను మాస్‌కి నచ్చేలా చెప్పిన విధానం, పాటల చిత్రీకరణ నచ్చాయన్నారు. ఆయన ఆలోచనల్లోంచే మా చిత్ర కథ రూపుదిద్దుకొంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం సమకూరుస్తారు. ఇంకా హీరోయిన్ ఎవరనేది నిర్ణయం కాలేదు'' అని వివరించారు.
ఈ చిత్రం టైటిల్ మారే అవకాసం ఉందని సమాచారం. గబ్బర్ సింగ్ టైటిల్ కు షోలే నిర్మాతలు రాయల్టీ బాగా ఎక్కువ అడగటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక ఈసారి 'బెంగాళ్ టైగర్ ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండవ వారంలో ప్రారంభమయ్యే అవకాసం ఉంది. ప్రారంభ సమయంలోనే పూర్తిగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు మీడియాకు రివిల్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం సంపత్ నంది పూర్తిగా అదే స్క్రిప్టుపై బిజీగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












