మహేష్ మ్యాజిక్ లో పవన్ సగం క్రేజ్ దక్కించుకొన్నా ఎక్కువే..!
'ఖలేజా" సినిమాలో మహేష్ బాబు తర్వాత చెప్పుకోదగ్గ విశేష ఏమిటంటే 'సదాశి సన్యాసి" పాట మణిశర్మ అందించిన అత్యుత్తమ సంగీతంలో ఈ పాట చెప్పుకోదగ్గది. అలాగే రామజోగయ్య శాస్త్రి రచనకు మణిశర్మ కూర్చిన బాణీ రాష్ట్రం మొత్తం మార్మోగింది. శివుని సెంటిమెంట్ ఇంతకు మునుపు 'ఇంద్ర"లో చిరంజీవికి కూడా వర్కౌట్ కావటంతో పవన్ కళ్యాణ్ కూడా త'తీన్ మార్"లో మణిశర్మతో ఓ పాట చేయించుకున్నాడు.
వారణాసి నేపధ్యంలో సాగే ఈ సాంగు ఇప్పటికైతే అనుకున్న రేంజ్ లో ఊపలేకపోయింది. పాత ట్యూన్లను తలపిస్తున్న ఈ 'శివ శంకర.."పాటకు రామజోగయ్య పెన్ను కూడా పదును కోల్సోయినట్లుగా అన్సించింది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే 'సదాశివ సన్యాసి" రేంజ్ లో మ్యాజిక్ చేస్తుంది అనుకున్న 'తీన్ మార్" పాట అందులో సగం క్రేజు సంపాదించినా ఎక్కువే. చిత్రీకరణలో ఏదైనా వైవిధ్యం కనబరిస్తే తప్ప పవన్ కళ్యాణ్ రేంజ్ కి సరిపోయే పాట మాత్రం కాదనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











